D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / మేడ్చల్ /దమ్మాయిగూడ : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ వైరా నవంబర్ 10 (అక్షరంన్యూస్) వైరా స్థానిక క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి అందెశ్రీ కి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా అందెశ్రీ చిత్రపటానికి విద్యాసంస్థలు చైర్మన్ వాసిరెడ్డి సునీత కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను జాగృతి పరచడంలో అందెశ్రీ కీలకపాత్ర వహించారని తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక గేయాలను రచించి ప్రజలలో చైతన్యాన్ని నింపి తెలంగాణ సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేశారని అన్నారు.. ఆయన రచించిన జయ జయహే తెలంగాణ మరియు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే రచనలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ సంయోగిత ఎన్ఎస్ఎస్ పి ఓ లింగారావు, అధ్యాపకులు మజీదు, వేణు, చైతన్య,రామకృష్ణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు...
.
Aksharam Telugu Daily