GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / తెలంగాణ స్టేట్ బ్యూరో : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్:నవంబర్10 ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున హైదరాబాద్ లాలాగూడ లోని తన నివాసంలో ఆదివారం రాత్రి అస్వస్థతకు గురి కాగా దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తూ ఆయన ఈరోజు ఉదయం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మరణంతో సాహితీ లోకం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.అందెశ్రీ 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభిం చారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. అందెశ్రీ పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ఆయన కళ తో తెలంగాణ ఉద్యమం సేద్యానికి అక్షరం విత్తనాలు చల్లారు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనమంటూ జాతిని జాగృతి పరిచే గీత ఆలాపనతో అనునిత్యం తెలంగాణ పారాయణంతో ఉద్యమ శక్తులకు తిరుగుబాటు ఆయుధాలను అందించిన అక్షరం వీరుడు అందెశ్రీ.తుటాలాంటి మాటల పుట్ట కదిలిస్తే సమాజం లో లోపాలను కడిగిపారేసే కందిరీగలు తిట్టే దుర్మార్గాన్ని దునమాడే మాటల మాంత్రిక మరాఠీ ఎగిసే సెలయేరుల దునికే జలపాతంలా తనలో సుడులు తిరిగే కవి ప్రవాహాలు ఆసామినైన భూస్వామి నాయన పాలించే ఏ సామినైన ఎదిరించే దిక్కారం మండే భాస్వరం దుర్మార్గపు పాలనపై గలమెత్తిన తిరుగుబాటు స్వరం పాట పలికే అందశ్రీ నేడు కనుమరుగయ్యాడు చదువు లేకపోయినా తన నోటి నుండి జాలువారిన తెలంగాణ ఉద్యమ గీతం ప్రజల హృదయ గీతం అమరుల అంజలి గేయం జాతి చేతికి అందిన మారణాయుధం అందెశ్రీ అందించిన అసలైన తెలంగాణ జాతీయ గీతం అస్తిత్వం ఆత్మగౌరవాల తెలంగాణ కుటుంబం పాలకుల చేత చిక్కి అమరులను అసురులుగా మార్చి ఉద్యమ శక్తులను నిర్వీర్యం శక్తులుగా పరిగణించిన కవులు కళాకారులను అమ్ముడు పోయే వీధి బాగోతపు గాళ్లు గా. మలిచే ప్రయత్నించిన దరిద్రపుగొట్టు పాలనను ప్రశ్నించిన కళా సాయిధ పోరాట యోధుడు అందెశ్రీ తనను అవమానించి ప్రక్కకు తొలగించిన ఆయన రాసిన ప్రజా అంగీకార గీతం తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పాటలతో అందెశ్రీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే.అందెశ్రీకి ముగ్గురు కుమార్తులు, కుమారుడు ఉన్నారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతంతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్శిటీ నుంచి అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ లభించింది. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం లభించింది. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది. అలాంటి కళా యోధుడు కనుమరుగయ్యాడంటే ఏ వ్యక్తి కూడా నమ్మలేకపోయారు అదే అందెశ్రీ మృతికి ఘనమైన నివాళులు
.
Aksharam Telugu Daily