Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : * అక్షరం ప్రతినిధి హైదరాబాద్ హైదరాబాద్:మే 17 మహిళలే దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి, అన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు జూబ్లీహిల్స్ జే ఆర్ సి కన్వెన్షన్ లో వీ హబ్ ఉమెన్స్ యాక్స్ లరేషన్ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించా రు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ... మహిళల శక్తిని ప్రేరణగా తీసుకుని, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులవ్వా లన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా శక్తిని ఎప్పుడూ గౌరవిస్తుందని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. రూ.5,200 కోట్లను మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చామని, ఆర్టీసీ కూడా ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు. ఇందిరా గాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత వహించిందన్నారు. మన రాష్ట్రం 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారాలంటే, మహిళలు ఆర్థికంగా స్వావ లంబులవ్వాలి. ఇందుకోసం ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలు తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. గ్యాస్ సిలిండర్లను రూ.500కే అందిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళలకు అప్పగించామ ని, మహిళా సంఘాలు, సొంత వ్యాపారాలు పెరిగేలా స్టార్టప్ మద్దతు ఇస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఈ నెల 21న ఇందిరా మహిళా స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిం చనున్నట్లు సీఎం వెల్లడిం చారు. సెర్ప్ సభ్యుల సంఖ్యను కోటి మందికి పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
.
Aksharam Telugu Daily