Saturday, 18 April 2026 04:27:03 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రాణాలు హరిస్తున్న గడ్డి మందుపై నిషేధం విధించాలి. తెలంగాణ రాష్ట్రంలో క్షణికావేశంలో పారాక్వాట్ తాగి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తో

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 23 July 2025 06:22 PM Views : 889

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / ఖమ్మం జిల్లా : ఢిల్లీ /23 జులై /అక్షరం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో కలుపు నివారణకు వినియోగించే అత్యంత విషపూరితమైన పారాక్వాట్ అనే గడ్డి మందును క్షణికావేశంలో తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. కేంద్ర ప్రభుత్వం దీనిని నిషేధించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. బుధవారం 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. వైద్య చికిత్సలో విరుగుడు లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాణాలు కోల్పోతున్న రైతులు, వ్యవసాయ కూలీలు, యువకుల సంఖ్య ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 60కి పైగా దేశాల్లో నిషేధం పారాక్వాట్ పై 60 కి పైగా దేశాలు నిషేధం విధించాయని తెలిపారు. దీని వినియోగంతో పర్యావరణానికి కూడా ముప్పు పొంచి ఉందని, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటి ప్రధాన పంటల్లో ఈ గడ్డి మందు అవశేషాలు గుర్తించారని, ప్రజల ఆరోగ్యానికి కూడా హాని పొంచి ఉందని పేర్కొన్నారు. పారాక్వాట్ కు ప్రత్యామ్నాయ మందును అందుబాటులోకి తెచ్చి.. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని..ఈ సందర్భంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కోరారు. గడ్డి మందు నిషేధంపై కేంద్రం తీసుకునే నిర్ణయాత్మక చర్య మన వ్యవసాయాన్ని, సమాజ గౌరవాన్ని నిలబెడతాయని ఎంపీ రఘురాం రెడ్డి సూచించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :