Wednesday, 04 March 2026 01:46:13 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

_తెలంగాణ రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు జలదిబ్బంధంలో గ్రామాలు ప్రమాద స్థాయిలో పోచారం ప్రాజెక్టు ఇతర ప్రాజెక్టులకు వరద ముప్పు..!!

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 28 August 2025 09:54 AM Views : 666

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : *_* అక్షరం ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీవర్షాల వల్ల పలు ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కుండపోత వర్షాల వల్ల మిడ్ మానేరు రిజర్వాయర్ లోకి లక్ష క్యూసెక్కుల నీరు వస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. మిడ్ మానేరు జలాశయంలో 17 గేట్లు తెరచి 45వేల క్యూసెక్కుల వరదనీటిని లోయర్ మానేరు జలాశయంలోకి విడుదల చేశారు. మరో 9,600 క్యూసెక్కుల నీటిని అన్నపూర్ణ రిజర్వాయరులోకి విడుదల చేశారు. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులకు వరదనీరు భారీగా చేరింది. సింగూరు నది వరదనీరు చేరి నిండింది.బీబీపేటతోపాటు పలు చెరువులు నిండిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి. *_జంట జలాశయాలకు వరద_* హైదరాబాద్ నగరానికి మంచినీరందిస్తున్న జంట జలాశయాలు వరదనీటితో నిండిపోయాయి. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్థుతం 1789 అడుగుల మేర నీరు చేరింది. దీంతో రెండు గేట్లు తెరచి 226 క్యూసెక్కుల వరదనీటిని మూసీనదిలోకి వదిలారు. హిమాయత్ సాగర్ రిజర్వాయరు పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్థుతం దీనిలోకి 1762.82 అడుగుల నీరు చేరింది. దీంతో ఒక గేటు తెరచి 339 క్యూసెక్కుల వరదనీటిని మూసీలోకి వదిలారు. మూసీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. *_లోతట్టుప్రాంతాలు జలమయం_* వరదనీటితో కామారెడ్డిలోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. వరదనీటి ప్రవాహంతో 44 నంబరు జాతీయ రహదారిని మూసివేశారు.కామారెడ్డి జిల్లాల్లో కేవలం 14 గంటల్లో 499 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.వరదనీరు పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయం కోసం తమ పైకప్పులపైకి పరుగులు ఎక్కారు. నక్కవాగు వాగులో ఒక కుటుంబం కారు కొట్టుకుపోయింది. *_కొట్టుకుపోయిన రైలు పట్టాలు_* భిక్కనూర్-తల్మడ్ల, అకాన్‌పేట్-మెదక్ మధ్య రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. కమ్యూనికేషన్ లైన్లు దెబ్బతిన్నాయి. రాకపోకలు నిలిచిపోయి పలుగ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :