Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జూన్ 14 అక్షరం న్యూస్; ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బెస్ట్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు రక్తదాతలను ప్రోత్సహించడం, ఆయన గతంలో చేసిన సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సిఫారసు మేరకు రాజ్ భవన్ వర్గాలు ఏసీపీ గజ్జి కృష్ణ సేవలను గుర్తించి, బెస్ట్ మోటివేటర్ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రజలకు విశేష సేవలు అందించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ శనివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణకు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily