Saturday, 22 November 2025 11:08:51 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం ఉద్యోగులు ‘ఔట్..’!

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 27 October 2025 07:55 AM Views : 566

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : (అక్షరం ప్రతినిధి హైదరాబాద్) లక్షల మంది జీతాలు ఆపేస్తూ సర్కార్ సంచలన నిర్ణయం : వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లోని హెచ్ఓడీలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఆయా విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయీస్ వివరాలు ఇవ్వాలని, లేకపోతే వారికి వేతనాలు చెల్లించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదు. శనివారం రాత్రి వరకు కేవలం 55% మంది వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. మిగతా 45% మంది ఉద్యోగులు అసలు పనిచేస్తున్నారా? లేదా? అనే చర్చ జరుగుతున్నది. ఇంతకాలం సదరు ఎంప్లాయీస్ వివరాలను రికార్డుల్లో నమోదు చేసి, ఆ జీతాలను అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకున్నట్టు అనుమానం మొదలైంది. అందుకే ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వివరాలు ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్నది. సగం మంది నకిలీలే? వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 4,93,820 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో 2,74,844 మంది ఉద్యోగుల వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మిగతా 2,18,976 మంది వివరాలు లేవు. దీంతో ఈ నెల 17న అన్ని శాఖలకు ఆర్థిక శాఖ సర్య్కూలర్ పంపింది. ప్రతి ఉద్యోగి ఆధార్ నంబరు, బ్యాంకు అకౌంట్ వివరాలను ఐఎఫ్ఎమ్ఐఎస్ పోర్టల్‌లో అక్టోబర్ 25వ తేదీలోపు నమోదు చేయాలని ఆదేశించింది. లేదంటే వచ్చేనెల నుంచి వారికి జీతాలు చెల్లించబోమని స్పష్టం చేసింది. కానీ, శనివారం రాత్రి వరకు సుమారు లక్ష మంది ఎంప్లాయీస్ వివరాలు మాత్రమే నమోదైనట్టు అధికారులు గుర్తించారు. మిగతా లక్షమంది వివరాలు మాత్రం నమోదు చేయలేదు. దీంతో వారంతా నకిలీలే అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. ఆధార్ లింక్ లేకపోవడంతోనే కొందరు అధికారులు ఇన్నాళ్లూ ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రికార్డుల్లో తమకు ఇష్టం ఉన్న వ్యక్తుల పేర్లు రాసుకుని జీతాలు చెల్లించగా, కొందరైతే ఒకే వ్యక్తి పేరుతో నాలుగైదు శాఖల్లో వేతనాలు డ్రా చేశారని ఆరోపణలున్నాయి. దొరికిపోతామని భయం ఇంతకాలం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు జీతాల చెల్లింపుల్లో ఆడిటింగ్ లేదు. సర్కార్ మానిటరింగ్ లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకోవడం, వారికి జీతాలు చెల్లించడం సాగింది. పనిచేయకున్నా చేస్తున్నట్టు రికార్డుల్లో నమోదు చేసి, ఆ జీతాలను అధికారులు, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు వాటాలుగా పంచుకున్నట్టు సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎంప్లాయీస్ వివరాలను ఆధార్ లింక్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారుల్లో భయం మొదలైంది. దీంతో కేవలం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు మాత్రమే అప్‌లోడ్ చేశారు. ఇంతకాలం పనిచేయని వారికి, నకిలీలకు జీతాలు చెల్లించి.. ఇప్పుడు వివరాలు నమోదు చేస్తే దొరికిపోతామనే భయంతో వారి వివరాలను నమోదు చేయకుండా అధికారులు మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. జీతాలు వెనక్కి తీసుకుంటారా? కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నట్టు గత ఐదారేండ్లుగా రికార్డుల్లో ఎంప్లాయీస్ వివరాలు సృష్టించి, శాలరీలు కొల్లగొట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే భయం ఆఫీసర్లను వెంటాడుతున్నది. ఇన్నాళ్లు పనిచేయకున్నా చేసినట్టు చూయించి తీసుకున్న శాలరీలను వారి నుంచి ప్రభుత్వం తీసుకుంటుందనే చర్చ జరుగుతున్నది. అయితే ఇప్పటి వరకు నమోదైన ఎంప్లాయీస్ వివరాలను 360 డిగ్రీల్లో స్క్రూటినింగ్ చేసి, అందులో ఎవరైనా నకిలీలు ఉంటే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఆధార్ లింక్ చేయని వారికి జీతాలు ఇవ్వొద్దు.. సర్క్యూలర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ఐఎఫ్ఎమ్ఐఎస్ పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అక్టోబర్ జీతం చెల్లించొద్దని ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది. లింకింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు సదరు ఎంప్లాయీస్‌కు జీతాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆధార్ లింక్ చేసిన ఎంప్లాయీస్‌కు యథావిధిగా జీతాలు చెల్లించాలని పేర్కొంది. కొన్ని శాఖలు తమ వద్ద ఉన్న హెడ్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఆధార్ లింక్ చేయని ఎంప్లాయీస్‌కు జీతాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇష్టానుసారంగా జీతాలు చెల్లిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :