D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 13 (అక్షరంన్యూస్) గతంలో జడ్పిటిసి గా ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కలకొడిమ గ్రామాన్ని ముందు ఎన్నడు చేయని విధంగా అభివృద్ధి చేసి చూపించానని మరొకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచి బరిలోకి దిరిశాల ప్రమీల పోటీలో సిద్ధంగా ఉన్నారు. తను జడ్పిటిసి గా చేసినప్పుడు సొంత గ్రామమైన కలకొడిమ గ్రామాన్ని తీర్చిదిద్దానని గ్రామంలో ఉన్న చెరువులు పూడికను, సిసి రోడ్లను, రెండు వాటర్ ట్యాంకులను, కట్టించి గ్రామ ప్రజలకు నీటి కొరత లేకుండా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో గ్రామాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి దిరిశాల ప్రమీల, దాసురావు మాట్లాడుతూ గతంలో మేము చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాదని, ఇంకా గ్రామంలో కావలసిన శివాలయాన్ని, రామాలయాన్ని కూడా నిర్మించామని, అవకాశమైతే మినీ ట్యాంక్ కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. మీ అమూల్యమైన ఓటు ను ఫుట్బాల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily