Sunday, 14 July 2024 09:07:41 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

ప్రసూతి మరణాలను నివారించడానికి సూరక్షితమైన మాతృత్వ సేవలు మెరుగు పరచాలి... ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్...

ప్రసూతి మరణాలను తగ్గించాలి...


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 06 June 2024 06:07 PM Views : 236

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి అద్యక్షతన మహబూబాబాద్ జిల్లాలో గత సంవత్చరము ఏప్రిల్ నుండి ఈ సంవత్చరము మార్చి వరకు జిల్లాలో జరిగిన 12 మాతృ మరణాలపైన జిల్లాలలోని మెడికల్ ఆఫీసర్ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిదిగా విచ్చేసి మాట్లాడుతూ, ప్రసూతి మరణం అనేది గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజులలోపు, తీవ్రతరం కాబడిన ఏదైనా కారణంతో మరణించిన మహిళ (లేదా బాలిక) మరణమును మాతృ మరణము అంటారని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీ ఇంటి వద్ద గాని, రెఫరల్ హెల్త్ ఫెసిలిటీ వద్ద లేదా ప్రసూతి కొరకు తీసుకొని వెలుతున్నప్పుడు మార్గo మద్యలో గాని సంభవించే ప్రతి ప్రసూతి మరణాన్ని 24 నుండి 48 గంటలలోపు తెలియజేయాలని మరియు సమీక్షించబడాలని ఆయన తెలిపారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి మాట్లాడుతూ ఒక గర్భిణీ తను గర్భం దరించిన వెంటనే కుటుంబ సభ్యులకు తెలియచేసి దగ్గరలోని ఆరోగ్య కార్యకర్త వద్ద నమోదు చేయుంచుకోని క్రమం తప్పకుండా డాక్టర్లతో పరీక్షుంచుకొని వారు చెప్పిన సూచనలు సలహాలు పాటించడం వలన ప్రసూతి మరణాలను నివారించవచ్చని, ప్రసూతి మరణ సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం భవిష్యత్తులో ప్రసూతి మరియు నవజాత శిశువుల అనారోగ్యం మరియు మరణాలను నివారించడానికి సురక్షితమైన మాతృత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడం మరియు నాణ్యమైన ప్రసూతి మరియు నవజాత ఆరోగ్య సేవలను పొందడంలో భవిష్యత్తులో లోపాలను నివారించడానికి చర్యలను గుర్తించవచ్చని ఆమె పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ వెంకట్రాములు మాట్లాడుతూ గర్భం మరియు ప్రసవ సమయంలో ప్రతి సంవత్సరం అర మిలియన్ మంది మహిళలు మరణిస్తున్నారని అంచనా వేయబడిందని మరియు ప్రసవ సమయంలో జీవించి ఉన్న మరో 7+ మిలియన్ల మంది మహిళలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం తెలుస్తుందని, ప్రసూతి మరణ సమీక్ష వల్ల ఆరోగ్య సిబ్బంది, మరియు కుటుంబాలు ఒక విషాదకరమైన మరియు తరచుగా నివారించదగిన మరణాలను ఏ విదంగా అరికట్ట వచ్చో నేర్చుకునే అవకాశాన్ని అందిస్తుందని ఆయన పేరుకొన్నారు. ఈ సమీక్షాసమావేశం లో డిప్యూటీ డి‌ఎం‌హెచ్‌ఓ లు అంబరీష, డాక్టర్ మురళీధర్, ప్రోగ్రాం అధికారులు, డాక్టర్ బిందుశ్రీ, డాక్టర్ నాగేశ్వర్ రావు, డాక్టర్ సుధీర్ రెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విద్య, గూడూర్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్, ప్రసాద్, హెల్త్ ఎడ్యు కేటర్ లు, మహేందర్ రెడ్డి, పురుషోత్తమ్, కే‌వి రాజు, గీత, ఇన్ చార్జ్ డి‌పి‌హెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, ఎన్‌హెచ్‌ఎం డి‌పి‌ఓ రుక్ముద్దీన్ . ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యదికారులు తదితరులు పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :