Sunday, 08 September 2024 06:26:52 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి..

తల్లాడ విద్యుత్ శాఖ అధికారి రాజేష్..


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 20 July 2024 04:10 PM Views : 378

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ జూలై 20 (అక్షరంన్యూస్) నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ తల్లాడ పరిధిలో వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని తల్లాడ విద్యుత్ శాఖ అధికారి రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టలు ఆరవేసే జి.ఐ దండెము వైర్ల పై నుండి విద్యుత్ వైర్లు వెల్లడం వలన విద్యుత్ వైర్ల లో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం వలన దండెములకు విద్యుత్ సరఫరా అయ్యి షాక్ గురయ్యే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ దండెములను ఉపయోగించాలని కోరారు. ఇంటి ముందు రేకులకు కూడా విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉందని వివరించారు. విద్యుత్ సరఫరా వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండెం లకు, రేకులకు తగలకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. తరచుగా విద్యుత్ ప్రమాదాలు జరగడం ఆందోళన కలుగుతుందని ఇవి ప్రధానంగా భద్రత పట్ల నిర్లక్ష్యం , అవగాహన లోపం వలన విద్యుత్ వినియోగదారుల గృహాలలోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల , నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన, రైతులు స్విచ్ బోర్డు/మోటార్ స్టార్టర్ ల దగ్గర భద్రత ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించక పోవడం వలన విద్యుత్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయన్నారు . విద్యుత్ ప్రమాదాల నివారణకు అనుసరించవలసిన సూచనలు.. ముఖ్యంగా రైతు సోదరులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం, వ్యవసాయ పంపు సెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను కాని ఏమరపాటుతో తాకకూడదు. వ్యవ సాయ పంపుసెట్లను మరియు స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి. ఎర్త్ చేయబడని మోటార్లు, స్టార్టర్లు, జి.ఐ. పైపులు మరియు ఫుట్ వాల్వ్లు తాకడం అత్యంత ప్రమాదకరం. ఎర్తింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు. రైతులు, వినియోగదారులు స్వయంగా తమ సొంత కరెంట్ పనులను చేసుకొని నిండు ప్రాణాలు కోల్పుతున్నారని, చాల బాధాకరమని , అర్హత కలిగిన ఎలెక్ట్రిషియన్ తో పనులు చేసుకోగలని విజ్ఞప్తి చేస్తున్నారు. చేల యాజమానులు పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు , స్థంబాలు దగ్గరికి వెళ్లకుండా కాపరి వాళ్ళు జాగ్రత్త వహించాలని కోరారు. వర్షాకాలంలో తడిగా స్థంబాలు ఉండటం చేత ప్రమాదాలు జరిగే ఆవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించలని అన్నారు. ఇంటి వైరింగ్ కు సరైన ఎర్తింగ్ చేయండి, నాణ్యమైన ప్లగ్గులు, సెల్ ఫోన్ చార్జర్లను ఉపయోగించండి. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఎబి స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. వ్యవసాయ పంపుసెట్లకు ఫేజ్ కన్వర్టర్ వాడుట నిషేధము మరియు శిక్షార్హులు. మోటారు మరియు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే స్వంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం/హాని జరగవచ్చు. మోటారు రిపేరు తెలిసిన వారిచేతనే రిపేర్లు చేయించండి. వ్యవసాయ మోటార్లకు, గృహాలలో అతుకులు లేని సర్వీసు వైరును మాత్రమే ఉపయోగించండి. కరెంటు లైన్ల క్రింద పందిరిలు వేసి ప్రమాదాలకు గురవుతున్నారు. పందిరిలు వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోగలరు. చేపల వేటకు విద్యుత్ తీగలను అమర్చి చేపలను పట్టడం వలన షాక్ గురై చనిపోతున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం ఎవరు ఇలా చేయకండి. చేపలు పట్టడానికి విద్యుత్ తీగలు వాడరాదు. చట్ట విరుద్ధం. బోరు వేయుచున్నప్పుడు బోరు పైపులను తీసినప్పుడు పైన విద్యుత్ వైర్లు తాకి కొందరు చనిపోతున్నారు. దయచేసి బోర్లు వేయుచున్నప్పుడు పైన విద్యుత్తు వైర్లు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని జాగ్రత్తగా బోర్లు వేయాలని కోరుచున్నాను. జెండా ఎగుర వేయునప్పుడు ఆ జెండా పైపులు రోడ్డు పై వైర్లకు తాకకుండా జాగ్రత్త వహిం చవలయును. వరి కోతల సమయంలో హార్వెస్టర్ల పైకి వెళ్ళినప్పుడు విద్యుత్ తీగలకు తగిలి ప్రమదాలు జరుగుతున్నాయి జాగ్రత్త వహించండి. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు వైర్లు నేల పై నుండి తీసుకువెళ్ళుతున్నారు. బాటసారులు ఆ వైర్లు చూడకుండా వెళ్ళుతు విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. నేల పై నుంచి విద్యుత్ వైర్లు వేయకూడదు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి తడి చేతులతో తాకి మాట్లాడం వలన షాక్ కు గురై చనిపోతున్నారు. దయచేసి చార్జింగ్ బంద్ చేసి మాట్లాడవలసిందిగా వినియోగదారులను కోరారు. కొన్ని చోట్ల జంతువుల నుండి పంట రక్షణ కొరకు విద్యుత్తు ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇది చట్ట రిత్య నేరం, పంట చుట్టు విద్యుత్తు ఫెన్సింగ్ ఉన్నచోట జాగ్రత్త చాలా అవసరం అటు వైపు వెళ్ళకుండ జాగ్రత్త వహించాలి. పాలాలకు విద్యుత్ కంచెలు వేయరాదు. వర్షాలు కురిసినప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు/సపోర్టు వైరును, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకరాదు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకరాదు గమనించిన వెంటనే సంబందిత విద్యుత్ సిబ్బందికి తెలియచేయగలరు. ఎవరికైనా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్ కు గురైన వ్యక్తిని రక్షించాలన్న ఆతృతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్ కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడడమే సరియైన పరిష్కారం. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్ర స్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సబ్ ఇంజనీర్ , సెక్షన్ ఆఫీసర్ గార్లను సంప్రదించి వారి సేవలను పొందండి. ఈ జాగ్రత్తలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆయన కోరారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :