Monday, 07 October 2024 10:51:43 PM
 Breaking
     -> పేద కుంటుంబాలకు ఆర్ధిక చేయూత 'కళ్యాణలక్ష్మి' :--66మంది లబ్దిదారులకు రూ.66.07లక్షల విలువచేసే చెక్కులు  పంపిణి..  ..      -> సింగభూపాలెం చెరువు అభివృద్ధిపై ప్రత్యేక ద్రుష్టి సారించాం : -చెరువు సుందరీకరణ, అభివృద్ధికి రూ.8.50కోట్లు మంజూరు....      -> నిబంధనలు ఉల్లంఘించిన నలుగురి వాహనదారుల లైసెన్స్ లు రద్దు :   -నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే ఇక సీజ్... ..      -> రాజస్థాన్‌ నుంచి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న 27 మంది అరెస్ట్‌ : ..      -> ఇండియన్ బ్యాంక్ ఎదుట రైతుల నిరసన పోలీసుల మొహరింపు..      -> "సర్" రైస్ మిల్లు పై సివిల్ సప్లై అధికారుల దాడులు.....      -> నేటి నుంచి సింగరేణి, కాకతీయ రైళ్లు రద్దు :- చీఫ్ కమర్షియల్ అధికారి జేమ్స్పల్ .....      -> వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా భాద్యతగా విధులు నిర్వర్తించాలి : ఎస్పీ రోహిత్ రాజు....      -> ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పాలాభిషేకం చేసిన సింగరేణి రుద్రంపూర్ కాంట్రాక్ట్ కార్మికులు...      -> స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి కి ఘన నివాళులు :..      -> భారత సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం - పండుగ ఉత్సవాలు ఐక్యమత్యానికి వేదికగా నిలవాలి..      -> భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు : -జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాలు....      -> మహిళల భద్రత షీ టీం భాద్యత : -8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చు.....      -> ***అక్షరం ఎఫెక్ట్ *** రోడ్డు పై ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించిన పంచాయతీ సిబ్బంది..      -> ఏచూరి చనిపోయే వరకు ఒక ఆదర్శ కమ్యూనిష్ట్ గానే జీవించారు :..      -> అక్షరం కథనానికి స్పందన...రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన అధికారులు.....      -> తోటపల్లి - బేగంపేట రోడ్డు పై ప్రమాదకరంగా చెట్టు..      -> మానవత్వం చాటుకున్న ఎస్పి రోహిత్ రాజ్...తన వద్ద పని చేసే గన్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం..      -> నామ కు దక్షిణ మధ్య రైల్వే అభినందనలు.. జెడ్ఆర్ యుసిసి సభ్యునిగా నామ విశేషమైన కృషి....      -> ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు... పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ..

పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 06 September 2024 05:36 PM Views : 122

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / తెలంగాణ స్టేట్ బ్యూరో : అక్షరం న్యూస్ హైదరాబాద్ తెలంగాణ నూతన పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొనసాగారు ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ కుమార్ గౌడ్ : నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌కు కొత్త పీసీసీ అధ్య‌క్షుడిని నియ‌మించేందుకు కాంగ్రెస్ పార్టీకి 9 నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు మ‌హేశ్ కుమార్ గౌడ్. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. ఇక పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు. కానీ చివ‌ర‌కు రేవంత్‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వ‌రించింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే క‌స‌ర‌త్తు రెండు వారాల క్రిత‌మే పూర్త‌యిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా నేడు ప్ర‌క‌టించింది. మ‌హేశ్ కుమార్ గౌడ్ రాజ‌కీయ నేప‌థ్యం.. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్‌ జిల్లాలోని భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జ‌న్మించారు. గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. మహేష్ కుమార్ గౌడ్ గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు. మహేష్ కుమార్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓట‌మి చ‌విచూశారు. ఆ తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుల‌య్యారు. 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుల‌య్యారు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు మహేశ్ కుమార్ గౌడ్. టీపీసీసీగా నియమితులు కావడంతో ఆనందం వ్యక్తం చేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :