Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం : ఖమ్మం/ వైరా సెప్టెంబర్ 3 (అక్షరంన్యూస్) బోనకల్: అత్యవసర మరమ్మతుల పనులను పరిశీలించిన *కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్*, ఇటీవల విపరీతంగా కురుస్తున్న వర్షాలకు అనేక పట్టణాలు,పల్లెలు అతలాకుతలమయ్యాయి. మండల కేంద్రంలోని బోనకల్ గ్రామంలో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయి పలు గృహాలు నీట మునిగాయి. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని గ్రామాల్లో అత్యవసరం మరమ్మత్తుల పనులను చేపట్టాల్సిందిగా, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించిన విషయం తెలిసినదే. అందులో భాగంగా బోనకల్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది నిర్వహించిన మరమ్మత్తుల పనులను మండల అధ్యక్షులు గాలి దుర్గారావు, కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్ లు పర్యవేక్షించారు. స్థానికంగా తలెత్తిన కొన్ని సమస్యలను బీపీ నాయక్ స్వయంగా పరిశీలించి స్థానికులతో మాట్లాడి మరమ్మత్తు పనులను కొనసాగించేందుకు చొరవ చూపారు. ఎలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర సహాయార్థం పంచాయతీ అధికారులు, సిబ్బందిని వెంటనే సంప్రదించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సదా ముందు ఉంటామని ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రజలందరూ ఏకమై ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు.
.
Aksharam Telugu Daily