Sunday, 14 July 2024 09:10:28 AM
 Breaking
     -> పింఛన్ రికవరీ దుర్మార్గపు చర్య - పండు ముసలోళ్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని నోటీసులు -..      -> నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణను పొందిన పోలీస్ జాగిలాలతో తనిఖీలు  :..      -> విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణం లో విద్యను అభ్యసించడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి :..      -> వారాంతపు సంత టెండరు రద్దు చేయాలి : -సిండికేట్ గా మారిన కాంట్రాక్టర్ల వ్యవహారం పై విచారణ జరపాలి....      -> పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కోర్టు డ్యూటీ అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :..      -> ప్రతి ఒక్కరు పరిసరాలను శుబ్రంగా వుంచుకోవాలి :-వార్డు కౌన్సిలర్ సహేరా బేగం.. ..      -> బొగ్గుగనుల ప్రైవేటీకరణపై భగ్గుమన్న శ్రామిక సంఘాలు : -  -వేలం ప్రక్రియను నిలిపివేయకుంటే కోల్బెల్ట్ ప్రాంతాలను స్తంభింప చేస్తాం....      -> జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలి  : - -విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి .....      -> శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : ..      -> డి. శ్రీనివాస్ మరణం రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు :..      -> ప్రైవేటీకరణను అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ....      -> వడ్లుర్-కొండాపూర్ రోడ్డుకు మరమత్తులు ..      -> మూతపడిన పాఠశాల పునఃప్రారంభం ..      -> అంగన్వాడీకి ఫ్యాను, దుస్తుల పంపిణీ..      -> సంపూర్ణ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : ..      -> ఉర్దూఘర్ అధ్యక్షులు   నయీమ్ ఖురేషి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారులకు ఘన సన్మానం :..      -> పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> సీతారామ ఎత్తిపోతల పధకం పంపు హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...      -> వాహన తనిఖీల్లో ద్విచక్ర వాహనాల దొంగను పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు :..      -> జాబ్ క్యాలెండర్ ప్రకటించండి :..

ఆరు నెలలుగా అందని వేతనాలు... పట్టించుకోని అధికారులు... అరిగోస పడుతున్న కుటుంబాలు...

ప్రభుత్వాలు మారిన పంచాయతీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదు... పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలి... కార్మికులకు కనీస భద్రత పరికరాలు చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, రెండు జతల బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె ఇవ్వాలి...


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 06 June 2024 05:35 PM Views : 255

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /జూన్ 6/అక్షరం న్యూస్... అంటురోగాలు ప్రభలకుండా గ్రామాలను నిత్యం శుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడే గ్రామపంచాయతీ కార్మికులకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలలుగా జీతాలు అందక బాధిత కుటుంబాలు అరిగోస పడుతున్నాయి. జీతాల సమస్యకు నిరసనగా గ్రామపంచాయతీ కార్మికులు విధులకు బహిష్కరిస్తే అంతటా చెత్త చెదారం పేరుకోపోయి గ్రామాలు కంపు కొట్టి ప్రజారోగ్యం మంటగలిసే ప్రమాదం పొంచి ఉంది.ప్రభుత్వాలు మారిన పంచాయతీ కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాపితంగా ఒక్కొక్క గ్రామపంచాయతీ లో రెండు నుండి ఆరు నెలల వరకు వేతనాల బకాయిలు ఉన్నాయి. కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడం దుర్భరంగ మారింది. కార్మికులకు ఇవ్వాల్సిన కనీస భద్రత పరికరాలు చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, రెండు జతల బట్టలు, సబ్బులు, కొబ్బరి నూనె ఇవ్వాలని జి ఓ లు వచ్చినప్పటీకి వాటిని అమలు చేయడంలో మండల స్థాయి అధికారులు వైఫల్యం చెందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో పంచాయతీ కార్మికులు పస్తులు ఉండాల్సిన స్థితి నెలకొంది. కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు, కానీ వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని కార్మికుల ఆందోళన. రెక్కాడితే కానీ డొక్కాడని పంచాయతీ కార్మికులతో జీతాల పేరుతో నిర్లక్ష్యం చేయడం సరికాదు. పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తే వర్షాకాలంలో పారిశుద్ధ్యం పడకేస్తే ప్రమాదమే అని ప్రజలు అంటున్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, వారికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఇందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :