అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / : దేశ ప్రజలకు అంతగా ఉపయోగంలో లేని పురాతన చట్టాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇలాంటి పలు చట్టాలు ప్రజలకు, వ్యవస్థకు అసౌకర్యకరంగా తయారయ్యాయని, ఈ చట్టాలను తొలగించి ప్రజలకు ప్రశాంత జీవనం అందించాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారని ఆయన చెప్పారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని చట్టాలు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయని, ఇలాంటి చట్టాలు వారికి భారంగా మారుతున్నాయని కిరణ్ రిజిజు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు సరిపోని, ప్రజలకు అవసరం లేని పురాతన చట్టాలు ఉండికూడా ఎలాంటి లాభలేనందున వాటిని తొలగించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలకు భారంగా తయారైన అనేక చట్టాలను అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ఇలాంటి 1500 చట్టాలను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.
.
Aksharam Telugu Daily