Wednesday, 29 May 2024 04:28:07 PM
 Breaking
     -> రేపు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం..      -> సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :..      -> సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం : ..      -> టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.....      -> వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి :-జాతీయ కార్యదర్శి బి.వెంకట్.....      -> ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం.....      -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు.. మాజీ మంత్రులకు నోటీసులు..!

.

Date : 03 April 2024 08:54 AM Views : 667

అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ 03 ఏప్రిల్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఓ ప్రధాన పార్టీ తరఫున పోలీసు వాహనాల్లో పెద్దఎత్తున నిధులు తరలించినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రధానాంశాలు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మలుపులు పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపు మాజీ మంత్రులకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మెున్నటి వరకు ప్రతిపక్ష నేతలు, వారి బంధువులు, కొందరు వ్యాపారుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రాగా.. ఈ కేసులో నిందితులను విచారించగా మరికొన్ని విషయాలు బయటపడుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల సమయంలో స్వయంగా పోలీసు వాహనాల్లోనే ఓ ప్రధాన పార్టీకి చెందిన డబ్బులు తరలించినట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్ వాహనాలయితే తనిఖీలు చేపట్టరనే ఉద్దేశ్యంతో కొందరు కీలక నేతలకు చెందిన డబ్బును తరలించినట్లు సమాచారం. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డ అభ్యర్థులతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండవచ్చునని తెలిసింది. త్వరలోనే కొందరు రాజకీయ ప్రముఖులకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని.. ఇందులో మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయంగా మరింత సంచలనంగా మారుతుంది. ఇక ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అనదపు ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్నలను తొలుత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాజీ డీసీపీ రాధా కిషన్ రావును కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. రాధా కిషన్ రావును విచారించేందుకు పోలీసులు నాంపల్లి న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు మధ్యాహ్నం విచారణకు రానుంది. ఆయన్ను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ చేరుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తాను ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఇది వరకే ప్రభాకర్ రావు ఓ పోలీసు ఉన్నతాధికారితో చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకుంటే ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈకేసులో తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. సుదీర్ఘ కాలం ఎస్‌ఐబీలో పని చేసి దయానంద్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ప్రభాకర్ రావుతో ఆయనకు సన్నిహిత్యం ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో ఆయన పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :