Wednesday, 29 May 2024 05:36:00 PM
 Breaking
     -> రేపు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం..      -> సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడుతూనే రూ.60 లక్షల రూపాయలు స్వాహా :..      -> సర్వే నెంబర్‌ 82లో భూ వివాదం : ..      -> టిఎస్ స్థానంలో టిజిగా మార్చాలి : -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.....      -> వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు అందించాలి :-జాతీయ కార్యదర్శి బి.వెంకట్.....      -> ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం -భద్రాద్రిలో మార్మోగిన సన్నాహక సమావేశం.....      -> నకిలీ విత్తనాలు విక్రయించిన శ్రీ లక్ష్మీ సీడ్స్ వారిపై చర్యలు తీసుకోవాలి :..      -> భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అహ్లె సున్నతుల్ జమాత్ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ కరీం ..      -> దేశ భవిష్యత్తు కోసం ఓటును వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు :-కాంగ్రెస్ ,సిపిఐ నాయకులు ....      -> పోలింగ్ ప్రశాంతం : ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు :..      -> ఓటు హక్కును వినియోగించుకున్న ఎస్పీ రోహిత్ రాజ్ :..      -> కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి...      -> బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముస్లింల రిజర్వేషన్లు ఎలా అమలు అవుతున్నాయి...? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ముస్లింలపైనే భాజపా కక్ష కట్టడం సరికాదు.....      -> టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు…..      -> కాంగ్రెస్ కార్యాలయం  బయట పార్క్ చేసిన కార్ల అద్దాలు ద్వంసం :..      -> బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడ : -తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి....      -> పసిపాప ప్రాణం కాపాడిన లారీ డ్రైవర్, పసి ప్రాణాన్ని నిలపెట్టి వైద్యం, వైద్య ఖర్చులకు వెనుకాడని దామెర ఎస్సై . అశోక్..      -> స్కూల్ యూనిఫామ్ లు విద్యార్థులకు సకాలంలో అందజేయాలి : ..      -> యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రవణ్ కుమార్ ..

తెలంగాణ ఛత్తీస్ ఘడ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డిజిపి పర్యటన

.భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డీ జి పి రవి గుప్తా

Date : 22 April 2024 07:59 PM Views : 913

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం చర్ల అక్షరం న్యూస్ ఏప్రిల్ 22--- రాబోయే పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి డిజిపి రవి గుప్తా అన్నారు. సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం పూసుగుప్ప ఉంజ్జుపల్లి లో గల పోలీస్ భద్రతా బలగాల క్యాంపులను డి జి పి రవి గుప్తా సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులకు సిబ్బంది నిషేధిత సిపిఐ మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వలన రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం హెలికాప్టర్ ద్వారా సారపాక ఐటీసి గెస్ట్ హౌస్ నకు చేరుకొని అక్కడ భద్రాద్రి కొత్తగూడెం ములుగు,భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు జిల్లాల ఎస్పీలతో ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.డిజిపి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.చెక్ పోస్ట్ వద్ద పనిచేస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అక్రమంగా నగదు,మద్యం రవాణాను అడ్డుకోవాలని సూచించారు.గత ఎన్నికల్లో మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.అనంతరం డిజిపి తో పాటు అధికారులందరూ భద్రాచలం శ్రీ సితా రామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో డీజీపీ వెంట అడిషనల్ డీజీపీ ఇంటిలిజెన్స్ శివధర్ రెడ్డి అడిషనల్ డీజీ విజయ్ కుమార్ సి ఆర్ పి ఎఫ్ సౌత్ జోన్ అడిషనల్ డీజీపీ రవి దీప్ సింగ్ సిఆర్పిఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ సౌత్ అడిషనల్ ఐజిపి చారు సిన్హా ఎస్ ఐ బి ఐజిపి సుమతి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ములుగు ఎస్పీ డా.శబరీష్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే ,ఎస్ఐబి ఎస్పీ రాజేష్,ఓఎస్డి కొత్తగూడెం సాయి మనోహర్ భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ జితే ,ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్,CRPF అధికారులు ఆర్.కె పాండా,ఎం.కె మీనా మోహన్,రితేష్ కుమార్ మరియు డీఎస్పీలు,సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.

.

AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :