Sunday, 02 April 2023 01:06:35 AM
 Breaking
     -> తెల్లారక ముందే తెల్లారిన బతుకులు.కూలీల ఆటో బోల్తా కూలీలు మృతి...      -> కూలీల ఆటో బోల్తా. ఇద్దరు కూలీలు సీరియస్...      -> ఆరెకుల రాష్ట్ర అధ్యక్షుడు పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి...      -> కంటి వెలుగు శిభిరాన్ని ప్రారంబించనున్న రసమయి..      -> కార్పొరేట్ శక్తుల బొజ్జలు నిపడానికే పరిమితమైన మోడి పాలన -ఎస్. వీరయ్య, సిపిఐ(ఎం) రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు..      -> ముస్లింలకు రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.....      -> పారిశుద్ధ్య నిర్వహణ, కంటివెలుగు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్..      -> పోషకాహారము చిరుధాన్యాల వినియోగంపై గర్భిణీ స్త్రీలకు అవగాహన..      -> రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన రైతులు..      -> 800 మెగావాట్ల తెలంగాణ ధర్మం పవర్ స్టేషన్ లోని మొదటి యూనిట్ ఎట్టకేలకు ఉత్పత్తి ప్రారంభం..      -> ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి :..      -> బిఆర్ఎస్ చేరికల కమిటీ ఇంఛార్జిలుగా బిఎస్ఆర్, శ్రీనివాస్ గుప్తా ..      -> ఉరి వేసుకొని యువకుని బలవన్మరణం..      -> పాపం ఉప సర్పంచ్....!..      -> ఎంతోమంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత మొలుగూరి ది ..      -> గుర్తుతెలియని మృతదేహం లభ్యం..      -> చెన్నూరు చేరుకున్నా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు..      -> రేపు చెన్నూరు నియోజకవర్గంలో వైద్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన..      -> జిల్లాకు రెండు బంగారు పథకాలు..      -> బండి సంజయ్ జర జాగ్రత్త...

సిద్దిపేట మాజీ కలెక్టర్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి పై ఐటి దాడులు..

జిల్లా కలెక్టర్ గా ఉంటూ.. రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిపోయిన వెంకట్రామిరెడ్డి పై ఐటీ దాడులు జరుగుతున్నాయి.

Date : 31 January 2023 06:31 PM Views : 170

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : జిల్లా కలెక్టర్ గా ఉంటూ.. రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయిపోయిన వెంకట్రామిరెడ్డి పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన కన్ ఫర్డ్ ఐఏఎస్. తెలంగాణ ప్రభుత్వ పెద్దల మెప్పు పొంది కలెక్టర్ గా సుదీర్ఘ కాలం ఉన్నారు. ఆయన పదవిలో ఉంటూనే..కుటుంబ సభ్యులతో భారీ రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్వహిస్తూ ఉండేవారు. వారి సంస్థ పేరు రాజ్ పుష్ప. ఇప్పుడు ఆ రాజ్ పుష్ప సంస్థపై పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ సంస్థకు సంబంధం ఉన్న ఇతర సంస్థల్లోనూ సోదాలు చేస్తున్నార.ు వసుధ ఫార్మా, రాజు పుష్ప, వెరిటెక్స్ సంస్థలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్మా పేరుతో వ్యాపారం చేస్తూ.. రాని ఆదాయాన్ని చూపించి ..రహస్యంగా తీసుకొచ్చిన మొత్తం రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలోకి మళ్లించినట్లుగా ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంగా యాభై ప్రారంతాల్ల ోసోదాలు జరుగుతున్నాయి. భారీగా పన్నులు ఎగవేత మాత్రమే కాదు.. అసలు బ్లాక్ మనీ గుట్టు కూడా ఈ కంపెనీల నుంచి బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ గా ఉంటూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గతంలో రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్ పుష్ప సంస్థకు పెద్ద ఎత్తున భూములను ప్రభుత్వం కట్టబెట్టిందని ఈ సంస్థ ప్రభుత్వ పెద్దలకు బినామీ అనే ఆరోపణలు కూడా చేశారు.వెంకట్రామిరెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల దర్యాప్తు సంస్థల దూకుడు కాస్త తగ్గినట్లు అనిపించింది కానీ.. ఈ సారి పెద్దగా హైలెట్ కాకుండా… కీలకమైన సంస్థలపై సోదాలు చేయడం సంచలనంగా మారింది.

.

Sk. YACOOB PASHA
7893003409
Editor & Chairman

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2023. All right Reserved.

Developed By :