Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మార్చి 07 అక్షరం న్యూస్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాఖ ఆదేశానుసారము మహిళా దినోత్సవ వేడుకల గోడప్రతిని ముఖ్య అతిధిగా పాల్గొన్న స్వప్న రాణి సునీల్ కుమార్ రెడ్డి కార్యదర్శి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పెద్దపల్లి జిల్లా మరియు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కార్యాచరణ కమిటీ కన్వీనర్ తూము రవీందర్ పటేల్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కార్యాచరణ కమిటీ చైర్మన్ శ్రీ బొంకూరి శంకర్ జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్ రావు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి లెంకల బ్రహ్మానంద రెడ్డి కోశాధికారి కే.కరుణాకర్ మహిళా ఉపాధ్యక్షురాలు అంజని ఉపాధ్యక్షులు ఎండీ సాజిద్ అలీ సంయుక్త కార్యదర్శి రౌతు ఆలేఖ్య పటేల్ శ్రీమతి కవిత సిడిపిఓ మరియు ఇతర శాఖల అధికారులు మరియు మహిళా ఉద్యోగులతో కలిపి ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమం తరువాత మహిళల ఆటల పోటీలను ప్రారంబించారు ఈ సందర్భంగా స్వప్న రాణి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీన నిర్వహించడం మహిళలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం అన్నారు మహిళలందరూ వివిధ రంగాలలో అభివృద్ధి చెందాలని మహిళల సమస్యలను తీర్చడానికి మనమంతా ముందు ఉండాలని తెలియజేయడం జరిగింది మరియు తూము రవీందర్ పటేల్ అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని గ్రామా స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదగాలని విద్యార్థినిగా అధికారిణిగా కుటుంబ పరంగా రాజకీయ పరంగా వ్యాపార పరంగా సామాజికంగా ఎంతో ఎతుకు ఎదగాలని ప్రపంచ వ్యాప్తంగా వివిధ హోదాలలో ఉంది మంచి పేరు సంపాదించిన మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని తెలియచేసారు మగవారికంటే మహిళలు ఎందులో కూడా తక్కువ కాదని నిరూపించుకోవాలని పిలుపు ఇవ్వడం జరిగింది
.
Aksharam Telugu Daily