Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి మార్చి 6 అక్షరం న్యూస్; అతడు గత 20 సంవత్సరాలుగా పగటి పూట వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గ్రామాలను కేంద్రంగా చేసుకొని ఇంటిలో ఎవరు లేని సమయంలో తాలబగులు పట్టి ఇంట్లోకి దూరి బీరువాలు పగలగొట్టి అందులో ఉన్న నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లడం అతని దొంగతనాల ప్రత్యేకత. ఇప్పటికీ పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన కూడా మళ్లీ అదే విధంగా దొంగతనాలకు పాల్పడడం పోలీసులకు కొరకరాని కోయగా మారాడు. ఇలా వరుస పగటి పూట గ్రామాలలో తాళం వేసివున్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న బోరిగం సంపత్ అనే దొంగను కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సాయంత్రం చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏడు గంటలకు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజ్జి కృష్ణ యాదవ్ వివరాలు వెల్లడించారు. పగటి పూట దొంగతనాలు పాల్పడుతున్న మలహర్రావు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోరిగం సంపత్ 35 ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అతని నుండి 2,25,000 వేల నగదు,149 గ్రాముల బంగారం, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు ఏసిపి వివరించారు. దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ తో పాటు పోలీస్ సిబ్బందిన ఆయన అభినందించి రివార్డు కూడా అందజేశారు
.
Aksharam Telugu Daily