Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -05(అక్షరం న్యూస్ ) విద్యార్థుల బృందం విహార యాత్ర విషాద యాత్రగా మారి ఓ యువకుడి ప్రాణం పోయింది. విహారయాత్ర విషాదయాత్రగా మిగిలింది.వివరల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రనికి చెందిన , హైదరాబాద్ పట్టణంలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి, ముత్యాల దేవేందర్- శారద దంపతుల ఏకైక సంతానం సాయిచరణ్ (21) హైదరాబాద్ లోని ఒక కళాశాలలో బి -టేక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాల కు చెందిన స్నేహితులతో సోమవారం ఉదయం కేరళ రాష్ట్రం పున్నమడ వెళ్లారు అక్కడ ప్రారంభ స్థానం నుండి పడి మునిగిపోయి, మృతి చెందాడు. విహారయాత్రలో భాగంగా ఎనిమిది మంది సహచర బి-టెక్ విద్యార్థులతో సాయిచరణ్ అలప్పుజ చేరుకున్నాడు. పున్నమడ జెట్టీ తూర్పు వైపున ఆపి ఉంచిన హౌస్‌బోట్ నుండి ఆ యువకుడు గట్టులో పడిపోయాడని . సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సాయిచరణ్ లేడని స్నేహితులు గమనించారు. అలప్పుజ నుండి అగ్నిమాపక దళం స్కూబా బృందం నిర్వహించిన శోధనలో మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు. సహచర విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. మృతుని శవం పోస్టుమార్టం అనంతరము బుధవారం స్వగ్రామం ముస్తాబాద్ కు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.. ఈ ఘటన ముస్తాబాద్ మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని వ్యక్తపరిచి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుని అంతిమ వీడ్కోలులో ప్రభుత్వ విప్ తో పాటు కాంగ్రెస్ పార్లమెంటు కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి కాంగ్రెస్ , పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, నాయకులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, భాను, నరేష్, మాజీ ఎంపీపీలు జనగామ శరత్ రావు , అక్కరాజు శ్రీనివాస్, సెస్ మాజీ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, నాయకులు సర్వర్ పాష, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily