Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -05(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం లోని పలు గ్రామాలలో ని దేవాలయల తాళం పగల కొట్టి హుండీ కొల్లాకొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ముస్తాబాద్ పోలీసులు అరెస్ట చేసి రిమాండ్‌కు తరలించారు. ముస్తాబాద్ ఎస్ ఐ చిందం గణేష్ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు ముస్తాబాద్ మండలం తెర్లమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు @ అంజి అనే వ్యక్తి ఇటీవల మొర్రాయిపల్లి, గూడూరు గ్రామాలలో ఉన్న ఆలయ తాళాలు పగలగొట్టి నగదుతోపాటు పలు వస్తువులను దొంగతనం చేసి అమ్ముకొని,జల్సాలకు అలవాటు పడి తమ కోరికలను తీర్చుకునేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు . బుధవారం ఉదయం మండల శివారులోని ఎం ఎం ఆర్ గార్డెన్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పకోవడం తో అతడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.
.
Aksharam Telugu Daily