Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కర్నూల్ జిల్లా : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మామిళ్ల పల్లెకు తూర్పు వైపున బ్రిటిష్ కాలం నాటి బావిని వెలుగులోకి తెచ్చినట్లు రచయిత ,చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ మైదుకూరు మున్సిపాలిటీలోని 1905 బ్రిటిష్ సర్వే మ్యాప్ ఆధారంగా ఈ బావి1268 సర్వేనెంబర్లో ఉన్నట్లు చెప్పారు. ఆనాటి కాలంలోని పిచ్చపాడు గ్రామం (చాపాడు మండలం)లో 400 కుటుంబాలు ఉండేవని వాటిలో ఎక్కువగా కాల్వ, కోనేటి, కాట్రగడ్డ,, మామిళ్ళపల్లె, పిచ్చపాటి అను ఇంటి పేరు కల బ్రాహ్మణులు నివసించేవారన్నారు. దీంతో పిచ్చపాడు గ్రామాన్ని బ్రాహ్మణ అగ్రహారంగా పిలిచేవారు.ఈ బ్రాహ్మణులు పాత మామిళ్ళపల్లెలో కూడా నివసించేవారని చెబుతున్నారు. పాతమామిళ్ళ పల్లెకు చెందిన కాల్వ బ్రాహ్మణులు కర్ణాలుగా పని చేసే సమయంలో ఈ బావిని నిర్మించారని చెప్పారు. బావి గుండ్రంగా, చిన్నదిగా ఉందని అన్నారు. బావి ఎటు చూసినా 12 అడుగుల కటకం ఉంటుందని తెలిపారు. బావికి కుడి వైపు మెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ బావిలోని నీటిని కపిలాల ద్వారా ఆకాలంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసే వారన్నారు. తాగునీటి అవసరాలకు ఈ బావి నీటిని ఉపయోగించేవారని వివరించారు. బ్రిటీష్ కాలం నాటి ఈ బావి గురించిన సమాచారం తనకు తెలిసేందుకు పాత మామిళ్లపల్లెకు చెందిన కృషివలుడు, కర్షకరత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత పందిటి క్రిష్ణమూర్తి , జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గోశెట్టి రామ్మోహన్ , శ్రీ నగరం రాఘవ సహకరించారని చెప్పారు.
.
Aksharam Telugu Daily