Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి ఫిబ్రవరి 26 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని గుంపుల రామభద్ర ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానాలు చేయడం కోసం అనేక గ్రామాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై పుణ్య స్థానాల ఆచరించి సీతారామచంద్రస్వామి మరియు శివాలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ రామభద్ర ఆలయం సమీపంలో పుష్కర ఘాటు నిర్మాణం చేయాలని దీనికి అధికారులు వెంటనే స్పందించి ఈ పుష్కర ఘాటు నిర్మాణం చేపడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అంతేకాకుండా ఆలయానికి ఆదరణ పెరిగి ఎంతో అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా సమీపంలో ఉండడం వలన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అటు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కాకుండా వరంగల్ జిల్లా నుండి కూడా పెద్దపల్లి జిల్లాల సమీప గ్రామాల ప్రజలు భారీగా భక్తులు వచ్చి రామభద్ర వంతెన సమీపంలో ఉన్న మానేరు నదిలో పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారని సరియైనటువంటి సౌకర్యలేక ఇబ్బంది పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి తీసుకువెళ్లి ఈ పుష్కర ఘాటు నిర్మాణం గనక చేపడితే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడనే పుణ్య స్థానాలు ఆచరించే పరిస్థితి ఏర్పడుతుందని పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని భక్తుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని ఈ పుష్కర ఘాట్ నిర్మాణం చేస్తే ఆలయం కూడా అభివృద్ధి చెందుతుందని అంతేకాకుండా భక్తులు అనేక ఛార్జీలు పెట్టుకొని దూర ప్రాంతాలకు మంథని కానీ కాలేశ్వరం కానీ పోయే పరిస్థితి ఉండదని సమీపంలోనే పుణ్య స్థానాలు ఆచరించి రామచంద్ర మూర్తి ఆలయాన్ని దర్శించుకుని అదే విధంగా శివాలయాన్ని దర్శించుకుంటారని భక్తులు కోరుతున్నారు అదేవిధంగా ఈ ఆలయాన్ని కూడా విపరీతమైనటువంటి ఆదరణ పెరిగి మంచి అభివృద్ధి చెందుతుందని భక్తులు కోరుతున్నారు
.
Aksharam Telugu Daily