Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా ప్రతినిధి : వరంగల్ జిల్లా /భూపాలాపల్లి /మెడిగడ్డ /అక్షరం న్యూస్ :కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త రాజలింగం హత్య మానవతమూర్తులు మేధావులు ఖండించాల్సిన అవసరం ఉన్నది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎండగడుతూ సామాజిక కార్యకర్త తన బాధ్యతగా హైకోర్టులో కేసు వేయడం జరిగిగింది. ఈ కేసు వాదిస్తున్న లాయర్ కూడా 6 నెలల క్రితం అనుమానాస్పదంగా మరణించడం కూడా జరిగింది. రేపు కోర్టులో వాదనలు ఉండగా ఒకరోజు ముందే కేసు వేసిన రాజలింగం హత్యజరగడం పై పలు అనుమానాలు వేళ్ళువేత్తుతున్నాయి అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కాళేశ్వరం నా రక్తం, నా బిడ్డ, నా డిజైన్ అని గొప్పలు చెప్పుకున్నన్నారు కేసీఆర్. ఈ హత్యల వెనుక ఉన్న మాజీ శాసనసభ్యులను వాళ్లను ప్రేరేపించిన కేటీఆర్ ను ప్రభుత్వం వెంటనే అరెస్టు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎందుకనగా కెసిఆర్, హరీష్ రావులను అరెస్టు చేయకపోతే ఈ కేసు లోని సాక్షులను మరియు కేసును పక్కదోవ పట్టించే ప్రమదము ఉన్నదని వీరిని వెంటనే అరెస్టు చేసి జ్యూడిషియల్ ఎంక్వయిరీ చేసి రాజలింగం న్యాయవాది కుటుంబాలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మొహమ్మద్ అయ్యూబ్ కోరడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా అవినీతికి పాల్పడితే ప్రశ్నించే వారిని ఇలా నిర్దాక్షంగా చంపివేయడం వాళ్ళు రేపు జరిగే అవినీతిని ప్రశ్నించడానికి ప్రజలు ముందుకు రారు కావున న్యాయవాదులు మేధావులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించలని వారు అన్నారు. రాజలింగం కుటుంబానికి న్యాయం చేసే వరకు పోరాడవలసిందిగా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి. మొహమ్మద్ అయూబ్ పిలుపునియ్యడం జరుగుతోంది.
.
Aksharam Telugu Daily