Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ స్థానిక సంస్థల సమరానికి సై అంటున్నారు. ప్రభుత్వం పైన వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోం ది. ఇటు బీజేపీ నాయకత్వం ఈ సారి తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కొత్త పార్టీ చీఫ్ నియామకం పైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణాదిలో తెలంగాణ నుంచి తమ ఆపరేషన్ మొదలు పెట్టాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దమైంది. ఢిల్లీ కసరత్తు తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి నియామకం పైన త్వరలోనే ప్రకటన రానుంది. ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పార్టీ నాయకత్వం వచ్చే వారం అధికారికంగా వెల్లడించనుంది. ఢిల్లీ ఎన్నిక లు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకటనలో ఆలస్యం జరుగు తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు తెలంగాణ నుంచే దక్షిణాది రాష్ట్రాల ఆపరేషన్ మొదలు పెట్టేందుకు సిద్దమైంది. అందులో భాగంగా తెలంగాణలో సామాజిక సమీకరణాల ఆధారంగా నిర్ణయాలు సామాజిక సమీకరణాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదం తీసుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అనూహ్యంగా ఎనిమిది సీట్లు దక్కటంతో తెలంగాణ పైన పట్టు చిక్కినట్లు భావిస్తున్న పార్టీ నాయకత్వం..పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు మరింత అలర్ట్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. జమిలి ఎన్నికలను పరిగణలోకి తీసుకొని కసరత్తు పూర్తి చేసింది. అధ్యక్షుడితో పాటుగా పార్టీలో కీలక మార్పులకు సమాయత్తం అయినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. బీసీ వర్గానికే ఇక, పార్టీలో పలు జిల్లాల్లో నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు పార్టీ గుర్తించింది. దీంతో, అందరినీ కలుపుకొని ముందుకెళ్లే నేతకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయించాలని డిసైడ్ అయింది. అధ్యక్షుడి ముదిరాజ్ వర్గానికి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ పేరు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. అయితే, ఈటెల రేపు ప్రకటన సమయంలో సీనియర్లు తుది ప్రయత్నాలు చేస్తున్నారు. అనూహ్యంగా మురళీధర్ రావు, డీకే అరుణ పేర్లు తెర మీదకు వచ్చాయి. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి.. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండటంతో ఇప్పుడు రెడ్డి వర్గానికి అవకాశం ఉండదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, బీసీ వర్గానికే అధ్యక్ష పదవి ఖాయమైనా.. రేసులో ఉన్న సీనియర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది.
.
Aksharam Telugu Daily