Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 8 అక్షరం న్యూస్:మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహ ఆవరణలో బిజెపి పార్టీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడంతో మండలంలోని బిజెపి పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడం పై ఆనందం వ్యక్తం చేశారు అనంతరం బానసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్, ఉప్పుల కుమార్, పిల్లలమర్రి రాములు, సముద్రాల శ్రీనివాస్,నల్లరాజిరెడ్డి, దాసరి కృష్ణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు దుస్స సాయి, కట్ల కిరణ్, సిద్ధం వైకుంఠం, కోట ఘనశ్యామ్, తోట కార్తీక్, దండవీణ రమేష్, బేర గణేష్ తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily