Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భీమదేవరపల్లి/ హనుమకొండ : హనుమకొండ/ భీమదేవరపల్లి/ఫిబ్రవరి 04(అక్షరం న్యూస్): ఎమ్మార్పీఎస్ భీమదేవరపల్లి మండల అధ్యక్షుడిగా ముత్తారం గ్రామానికి చెందిన కడారి ప్రభాస్ నియమితులయ్యారు. మండలంలోని ముల్కనూరులో మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి నియామక పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై ఈనెల 7న హైదరాబాద్ లో జరిగే 'వేల గొంతులు లక్ష డప్పుల' మహా ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఇందులో ఐలపాక స్వామి, పార్నందుల మహేందర్, గజ్జల వెంకటస్వామి, తాళ్ల పెళ్లి ఆశీర్వాదం, కనకం రాజ్ కుమార్, దిలీప్ ,రమేష్ గజ్జల రవీందర్ తదితరులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily