Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : పెద్దపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 1 అక్షరం న్యూస్; ఎవరికి ఏ ఆపద సంభవించిన నేనున్నానంటూ ఎప్పుడు ముందుంటూ తనకు తోచిన సాయం అందిస్తున్న విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ జర్నలిస్టుకు ప్రమాదం జరిగి కాలు కోల్పోయి దీనస్థితిలో ఉన్న ఆయనకు పదివేల రూపాయలు నగదు అందించి నేనున్నాను అంటూ అండగా నిలిచారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్న రాతుపల్లి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ గత రెండు దశాబ్దాలుగా వివిధ దినపత్రికలో పనిచేస్తున్నారు. గత నెల రోల రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడి కాల్ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి చిన్నరాతిపల్లి గ్రామంలో ఉన్న బందెల రాజశేఖర్ ను శనివారం సాయంత్రం పరామర్శించారు. బందెల రాజశేఖర్ కు 10000 రూపాయలు ఆర్థిక సాయం అందించి తనకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా విజ్జన్న యువసేన వ్యవస్థాపకులు అల్లం వినోద్ రెడ్డి మాట్లాడుతూ బందేల రాజశేఖర్ లాంటి సీనియర్ జర్నలిస్టు ప్రమాదానికి గురై కాలు కోల్పోవడం దురదృష్టకరమైన సంఘటనని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని భవిష్యత్తులో వైద్య ఖర్చుల కోసం తాను కొంత ఆర్థిక సాయం అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన వెంట సీనియర్ జర్నలిస్టు దొమ్మటి రాజేష్, వోడ్నాల అజయ్, గూగులోతు రామచందర్, బందెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily