Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ విమర్శించారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ విద్యా రంగానికి కేంద్ర బడ్జెట్ లో 10 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా కేవలం 2.53 శాతం మాత్రమే నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బీజేపి అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్లు ఇస్తామని హామీని ఎక్కడా ప్రస్తావించలేదని రాష్ట్రంలో బీజేపీ కి 8 మంది ఎంపీలు ఉన్నా నిధులు రాబట్టంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. పునర్విభజన చట్టంలో పొందు పరిచిన హామీల ప్రస్తావన లేదు. ట్రైబల్ యూనివర్సిటీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు, ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద యెత్తున నిధులు కేటాయించి ఎన్నికలు లేని రాష్ట్రలకు మొండి చెయ్యి చూపడం సరైంది కాదన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్.సంక్షేమానికి కేవలం 1.2 శాతం మాత్రమే నిధులు కేటాయించడం వల్ల సంక్షేమ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
-
Aksharam Telugu Daily