Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మెకానికల్ ఇంజనీరింగ్ లొ "ఇన్వె్టిగేషన్ అఫ్ మెకానికల్ క్యారెక్టరిస్టిక్స్ అఫ్ AL7075 మెటల్ మాట్రిక్స్ కంపోజిట్స్ యుసింగ్ AL2O3 అండ్ SiC నానో ఫిల్లర్ మెటీరిల్స్" అను అంశంలో చేసిన పరిశోధనకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం రామవరం నాగయ్య గడ్డ కు చెందిన దార లక్షమయ్య, సాయమ్మ ల అల్లుడు శేషప్పకి JNTUH యూనివర్సిటీ డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది. JNTUH మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు డాక్టర్ బి. ఆంజనేయ ప్రసాద్ పర్యవేక్షణలో చేసిన పరిశోధనలను గుర్తించి JNTUH శేషప్పకి ఈ డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది . సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన శేషప్ప డాక్టరేట్ పట్టా పొందడం పై కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహా అధ్యాపకులు అభినందనలు తెలిపారు. శేషప్ప ప్రస్తుతం హైదరాబాద్ లోని కేజీరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు...
-
Aksharam Telugu Daily