Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్, : వరంగల్ జిల్లా/ క్రైమ్ /పోచమ్మ మైదాన్/ అక్షరం న్యూస్:పోచమ్మ మైదానంలో నిర్వహించిన రోడ్ సేఫ్టీ అవేర్ నెస్ ర్యాలీ లో పాల్గొని, స్వయంగా ద్విచక్రవాహనాన్ని నడిపిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సురేఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ. ప్రమాదాలు అనుకోకుండా సంభవిస్థాయి అలాంటి సమయాలలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలను కాపోడుకోవచ్చు. ప్రాణాలు చాలా విలువైనవి. ప్రతీ ఒక్కరి కుటుంబంలో ఇంటి నుంచి పనుల మీద బయటకు వెళ్లిన వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లి వారి కుటుంబాల తో ఏటువంటి అనర్దాలు రాకుండా ఉండాలి అంటే రోడ్డు భద్రత పాటించండి అన్నారు.అనంతరం హెల్మెట్ ధరించి వాహనాన్ని నడిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ కమిషనర్, అంబర్ కిషోర్ ఐ ఏ ఎస్, ట్రాఫిక్ ఏసీపీ. సత్యనారాయణ, వరంగల్ ట్రాఫిక్ సీఐ. రామకృష్ణ, మరియు సిబ్బంది తదితరులు పాల్గున్నారు.
.
Aksharam Telugu Daily