Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా ప్రతినిధి : వరంగల్ జిల్లా /క్రైమ్ /ఉర్సు గుట్ట /అక్షరం న్యూస్ : ఉరుసుగుట్ట జక్కలొది క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి కొండా సురేఖ వెంటనే తన కాన్వాయ్ దిగి క్షేత్రగాత్రుడికి సహాయం అందించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు తీసుకొని సొంత కాన్వాయ్ లోని వాహనం పంపి హాస్పిటల్ లో అడ్మిట్ చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రగాత్రుడికి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో చేర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తక్షణమే మెరుగైన వైద్య సాయం అందజేయాలని ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెండెంట్ తో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు.ధైర్యంగా ఉండాలని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చి ఏదైనా సాహయం అవసరం ఉంటే సంప్రదించాలని చెప్పారు.
.
Aksharam Telugu Daily