Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్/ జనవరి- 24( అక్షరం న్యూస్ ) రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగం గా శుక్రవారం ముస్తాబాద్ ఎస్‌ఐ గణేష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు వినూత్నం గా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు పూలు అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదన్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని తెలిపారు. ట్రాఫిక్ జంక్షన్‌ల వద్ద, సిగ్నల్స్‌ల వద్ద నిబంధనలను అతిక్రమించరాదన్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారిపై చట్టపరంగా జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. సీటుబెల్టు ధరించి కారు నడపాలన్నారు.రో జురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily