Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం, స్టాఫ్ రిపోర్టర్ జనవరి వైరా, 23 (అక్షరంన్యూస్) ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తమ వంతు బాధ్యతగా పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కృషి చేయాలని వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ. వరప్రసాద్ తెలిపారు. గురువారం మధిర పట్టణంలోని శ్రీనిధి కాన్వెంట్ స్కూల్ నందు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు డ్రైవర్ తో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి అని తెలిపారు. కారు లో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ ను తప్పకుండా వాడాలన్నారు. వాహనాలను అతివేగంగా నడిపి ప్రమాదాలకు గురి కావద్దని ,మద్యం మత్తులో వాహనాలను నడపవద్దని వాహనాలను నడిపేటప్పుడు మీ కుటుంబ సభ్యులు మీకు గుర్తొచ్చే విధంగా ఉండాలని ఆయన అన్నారు .ఎందుకంటే ప్రమాదం జరిగి ఏదైనా జరగదని జరిగితే ఆ కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో గమనించాలన్నారు. అదేవిధంగా ప్రతి వాహనదారుడు వాహన దృవపత్రాలు కలిగి ఉండి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అతివేగంగా వాహనాలు నడపద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచందర్, స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులు రవాణా శాఖ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily