Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/కొత్తగూడెం/జనవరి 19/అక్షరం న్యూస్ : సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాలు అమలులో భాగంగా చేపడుతున్న సర్వేలో జిల్లా అధికార యంత్రాంగం అంతా నిమగ్ధమై ఉన్నందు వలన సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున ప్రజలందరూ గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి ఐ డి ఓ సి కార్యాలయానికి రావద్దని సూచించారు.
-
Aksharam Telugu Daily