Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి జిల్లా/ కొత్తగూడెం /జనవరి.18/ అక్షరం కలెక్టరేట్ న్యూస్ : ప్రభుత్వ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లడంలో పత్రికలదే కీలక పాత్ర అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అన్నారు. శనివారం అక్షరం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ మరియు గోడ క్యాలెండర్ ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ముందుగా అక్షరం దినపత్రిక చైర్మన్ అండ్ డైరెక్టర్ ఎస్.కే. యాకూబ్ పాషా కు శుభాకాంక్షలు తెలిపారు. అక్షరం దినపత్రిక దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం.డి. ఫహీం, రిపోర్టర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily