Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జనవరి -15(అక్షరం న్యూస్ ) ముగ్గుల పోటీలు సాంప్రదాయాలకు ప్రతీకలు అని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలకాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా మంగళవారం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా స్థానిక శివ కేశవ ఆలయంలో ముందుకు నిర్వహించిన రంగవల్లి చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నది. సంక్రాంతి పండుగను సూచించేలా వివిధ ఆకృతులు, ఆకర్శించే రంగులతో మహిళలు ఉత్సాహంగా ముగ్గులను వేశా రు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. విజేతలను ప్రకటించి,నలుగురికి బహుమతులు అందజేశారు. ప్రతి మహిళకు ప్రోత్సాహ బహుమతులు అందచేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముగ్గులు వేయడం మన సంస్కృతిలో ఒక భాగమన్నారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా మహిళలకు సంప్రదాయ ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు.ముగ్గుల పోటీలు ఐక్యతకు, ఆప్యాయతకు నిదర్శనమన్నారు.ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు.ఈ సందర్భంగా ముగ్గుల పోటీకి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శివకేశవ ఆలయ కమిటీ చైర్మన్ ఎలసాని దేవయ్య ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily