Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : * * మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జనవరి 15(అక్షరం న్యూస్) ఉమ్మడి మండలాల్లో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నిష్ణాతులైన వైద్యులచే ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చికిత్స మరియు మందుల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గంగారం మరియు కొత్తగూడ పోలీస్ వారు తేదీ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు గంగారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరుపేద ప్రజలు ఆర్థిక స్తోమత లేక పట్టణాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోలేని పరిస్థితుల్లో జబ్బుపడి ప్రాణాపాయస్థితికి చేరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకూడదన్న ఉద్దేశంతో సామాజిక దృక్కోణంలో ఆలోచన చేసిన మన జిల్లా ఎస్పీ గారు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క హెల్త్ క్యాంప్ లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి సీనియర్ ఎక్స్పర్ట్ డాక్టర్ల బృందం రాబోతుంది. డాక్టర్లు చేసిన వైద్య పరీక్షల్లో ఎవరికైనా మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే వారికి ఈ యొక్క ఓ.పి స్లిప్ తో సదరు హాస్పిటల్ లో ఉచిత వైద్యం అందించబడుతుంది. కావున రెండు మండలాల ప్రజలు ఈ యొక్క మెగా ఉచిత వైద్య శిబిరం యొక్క సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరనైనది. అలాగే మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. మీయొక్క గ్రామాల నుండి వైద్య శిబిరానికి చేరుకోవడానికి ఉచిత ప్రయాణం కల్పించేందుకు వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా ఎస్పీ గారు రాబోతున్నారు. కావున ప్రజలంతా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈకార్యక్రమంలో పోలీసు స్టేషన్ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily