Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట్/నేరేడుచర్ల : నేరేడుచర్ల అక్షరం న్యూస్ నేరేడుచర్ల షాదీఖానా నిర్మాణానికి 75 లక్షలు మంజూరు...... సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు..... వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి 12000,రైతు కూలీలకి 12000.... నేరేడుచర్ల మండల పరిధిలో 18.58 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన..... రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట/నేరేడుచర్ల/జనవరి 12అక్షరం న్యూస్ బడుగు బలహీన వర్గాల పిల్లలు అంతర్జాతీయ స్థాయి లో పోటీపడేలా గడ్డిపల్లి గ్రామంలో 300 కోట్ల రూపాయలతో ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకి శంఖుస్థాపన చేసుకున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.18.57 కోట్ల రూపాయల తో పలు అభివృద్ధి పనులకి నేరేడుచర్ల మున్సిపాల్టీ అలాగే మండల పరిధిలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో TUFIDC నిధులు 2.79 కోట్ల రూపాయలతో శివాలయం బైపాస్ ఆర్చి వద్ద జాన్ పహాడ్ ఆర్ & బి రోడ్డు నుండి హుజుర్నగర్ ఆర్ & బి రోడ్డు కి మంత్రి శంఖుస్థాపన చేశారు. జాన్ పహాడ్ రోడ్డులో 52 లక్షల రూపాయలతో జాన్ పహాడ్ రోడ్డు నుండి పి హెచ్ సి సెంటర్ వరకు సి సి రోడ్డు,అలాగే 1.50 కోట్లతో హిందూ స్మశాన వాటిక నుండి మెయిన్ రోడ్డు వరకు సి సి రోడ్ నిర్మాణ పనులకి , 1.50 కోట్ల రూపాయలతో నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో సి సి రోడ్లు, డ్రైనేజి ల నిర్మాణ పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. జాన్ పహాడ్ రోడ్డు లోగల మసీద్ నందు ముస్లిం మత ప్రతినిధులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముస్లిం ల అభివృద్ధి సంక్షేమం కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నేరేడుచర్లలో షాదిఖానా నిర్మాణానికి 75 లక్షలు మంజూరు చేస్తు స్థలం సేకరించాలని అధికారులకు సూచించారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల లో బాపిస్ట్ చర్చి లో క్రైస్తవ మతపెద్దలతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉందని మీరు ఆయురారోగ్యలతో సుఖ సంతోషాలతో జీవించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.దిర్శించర్ల గ్రామ పంచాయతీ వద్ద 3.38 కోట్ల రూపాయలతో దిర్శించర్ల నుండి ముత్యాలమ్మకుంట వరకు బి టి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దిర్శించర్ల గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 1.39 కోట్ల రూపాయలతో నేరేడుచర్ల మార్కెట్ వద్ద మార్కెట్ నుండి జాన్ పహాడ్ రోడ్డు వరకు సి సి రోడ్డు నిర్మాణ పనులకి, 38 లక్షల రూపాయలతో మార్కెట్ నుండి యన్ టి ఆర్ నగర్ వరకు సి సి రోడ్డు నిర్మాణ పనులకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. తదుపరి శిశు మందిర్ వద్ద 30 లక్షల రూపాయలతో గ్రంధాలయ నిర్మాణ పనులకి,2.84 కోట్ల రూపాయలతో ఆర్ 3 కాల్వ నుండి ఆరవ వార్డ్ కల్వర్ట్ వరకు,40 లక్షల రూపాయలతో టౌన్ హాల్ మొదటి అంతస్తు నిర్మాణ పనులకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తదుపరి నేరేడుచర్ల పరిధిలో శాంతినగర్, కమలనగర్ లలో 2 కోట్ల రూపాయలతో సి సి రోడ్డు నిర్మాణ పనులకి శంకుస్థాపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశారు.నేరేడుచర్ల మండల పరిధిలో పలు గ్రామాలలో మంజూరైన MGNREGS నిధులు 70 లక్షలతో నిర్మించే సి సి రోడ్డు పనులకు కల్లూరు గ్రామం లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి తరువాత వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి 12000 రైతు భరోసా ద్వారా అందజేస్తామని, స్వతంత్ర భారతదేశం లో ఎక్కడ లేని విధంగా రైతు కూలీలకి 12000 అందజేస్తామని, అర్హులైన అందరికి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని, ప్రతి వ్యక్తికి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామన్నారు.బి సి ల కొరకు కుల గుణన, ఎస్ సి ల వర్గీకరణ, ఆర్ టి సి లో మహిళలకు ఉచితంగా ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య శ్రీ సేవలు చేపడుతు ఇలా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కొరకు మీరు ఎన్నుకున్న ప్రభుత్వం నిజాయియితీగా, పారదర్శకంగా 24 గంటలు పనిచేస్తుందని ఇలా ఒక్క సంవత్సరం కాలంలో ఇంత అభివృద్ధి, సంక్షేమం చేపట్టడం నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూడలేదని మంత్రి తెలిపారు. కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాల ప్రజలు చూపెడుతున్న అభిమానాన్ని, ఆప్యాయతలను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రుణం కోసం తీర్చుకుంటానన్ని మీకు ఏ సమస్య ఉన్న మీ ఉత్తమన్నకి చెప్పాలని తెలిపారు.తదుపరి కబడ్డీ పోటీలను ప్రారంభించి వీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ యువత చదువు తో పాటు ఆటలపై శ్రద్ద పెట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఇంచార్జి ఆర్ డి ఓ సూర్యనారాయణ,మున్సిపల్ చైర్మన్ బచ్చలకూర ప్రకాష్ , ఆర్ & బి ఈ ఈ సీతారామయ్య,మున్సిపల్ కమిషనర్,తహసీల్దార్ సైదులు, వ్యవసాయ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి ఆర్ & బి డి ఈ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily