Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. బస్సు ముందు వెనుక భాగం ధ్వంసం అయ్యాయి. సురక్షితంగా బయట పడిన బస్సులో ప్రయాణికులు.. ఖమ్మం, స్టాఫ్ రిపోర్టర్ వైరా, జనవరి 12 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రం సమీపం లోని ఎన్ ఎస్పీ కాలువ సమీపంలో బస్సు. రెండు లారీలు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. బస్సు ముందు వెనుక భాగం ధ్వంసం అయ్యాయి. సురక్షితంగా బయట పడిన ప్రయాణికులు.. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా కొనిజర్ల ఎన్ఎస్పీ కాల్వ సమీపంలో హైదరాబాద్ నుండి ఒరిస్సా కు వెళుతున్న బస్సును ఖమ్మం నుండి వైరా వెళుతున్న యాష్ లారీ బస్సును ఢీ కొట్టింది. వెనక భాగం మరొక లారీ వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గూడ్స్ లారీని ఢీకొనడంతో ఇద్దరు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం హాస్పిటల్ తరలించారు. ఈ ప్రమాదంలో బస్సుముందు వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. బస్సులో 60 మంది ప్రయాణికులకు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కొనిజర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీలలో ఇరుక్కుపోయిన డ్రైవర్లను బయటికి తీసి ఖమ్మం హాస్పటల్ కు తరలించారు.
.
Aksharam Telugu Daily