Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : ** మహబూబాబాద్ జిల్లా /గంగారం/(అక్షరం న్యూస్) జనవరి 11 మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు గారు ఈరోజు *కొత్తగూడ* *మండలం* *ఓటాయి* *మండల* *పరిషత్* *ప్రాథమిక* *పాఠశాలను* మరియు *గంగారాం* *మండలం* *తిరుమలగండి* *గ్రామ* *పాఠశాల* లను సందర్శించి, ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన విద్యా విధానాలను సాంకేతికతను అందిపుచ్చుకోలేక, పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ, సకల సౌకర్యాలు కల్పిస్తూ, పూర్తి ఉచితంగా హాస్టల్ సౌకర్యంతో విద్యనందించే తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించినట్లయితే ఏజెన్సీ విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని, మంచి విద్యతో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మంచిగా స్థిరపడేందుకు దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో, గురుకుల విద్యాలయాల ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష మరియు జవహర్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష స్టడీ మెటీరియల్ తో పాటు మోడల్ టెస్ట్ పేపర్ల కు సంబంధించిన బుక్స్ ను విద్యార్థులకు ఉచితంగా అందించడం జరిగింది. *విద్యార్థులకు పాఠాలు బోధించి, ఆత్మీయ పలకరింపుతో పిల్లల్ని ఉత్సాహపరిచిన సీఐ* పుస్తకాల పంపిణీ అనంతరం సిఐ బాబురావు గారు విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించి వారిని కొన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు అడిగి, పిల్లలతో మమేకమై ఉత్సాహపరచడం జరిగింది. ఇచ్చిన మెటీరియల్ బాగా చదువుకొని ప్రవేశ పరీక్ష లో మంచి మార్కులు సాధించి గురుకుల విద్యాలయలలో సీటు సంపాదించాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. మీరంతా నిరుపేద కుటుంబ నేపథ్యం కలవారని, మంచిగా చదువుకోవడం వల్ల మాత్రమే మీ యొక్క జీవితాలు ఉన్నతంగా ఉంటాయని, మంచిగా చదివే విద్యార్థులకు మా ప్రోత్సాహం తప్పకుండా అందిస్తామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ మరియు పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున పాఠశాలకు, విద్యార్థులకు ఎలాంటి సహాయం కావలసిన అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడ ఎస్సై కుశ కుమార్, గంగారం ఎస్సై రవికుమార్, ప్రొబెషనరీ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
..
Aksharam Telugu Daily