Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా, జనవరి 10 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. రాత్రి సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ కార్యాలయంలో ఒకేరోజు రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు.. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) ఆమోదం పొందని స్థిరాస్తి ప్లాట్లకు 99 రిజిస్ట్రేషన్లు చేశారు . ఖమ్మం నగరపాలక సంస్థకు సరిహ ద్దుగా ఉండే వైరా పురపాలక సంఘంతో పాటు కొణిజర్ల మండలం పరిధిలో స్థిరాస్తి వెంచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఎల్ఆర్ఎస్ పథకానికి దరఖాస్తు చేసినవి ఉండగా అనుమతులు ఇంకా రాలేదు. అయినప్పటికీ క్రమబద్ధీకరణ అనుమ తులు లేని ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ ఏకంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం ప్రభుత్వ ఆదాయానికి గండి పడే విధంగా రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశమైంది. ఖమ్మం- వైరా ప్రధాన రహదారిలో స్థిరాస్తి వ్యాపారానికి మంచి డిమాండ్ ఉంది. కొణిజర్ల మండలంలో తనికెళ్ల అమ్మపాలెం తదితర ప్రాంతా లోనూ వెంచర్లు వెలిశాయి. వైరా, కొణిజర్ల మండ లాల్లో కొన్ని వెంచర్లు సరైన నిబంధనలు పాటిం చడం లేదన్న ఆరోపణలున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు అనుమతి లేని లేఅవుట్లలోని స్థలాల రిజిస్ట్రే షన్లు చేయకుండా ప్రభుత్వం పలు నిబంధనలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనుమతి లేకుండా ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణ కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు పరిశీల నలో ఉండగా ఇప్పటివరకు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. పట్టణ ప్రణాళికకు అనుగుణంగా ఉన్నవి, డీటీసీపీ, రెరా తదితర అనుమతులు పొందిన స్థిరాస్తులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు మాత్రం నిబంధనలు తోసిపుచ్చి.. ఎల్ఆర్ఎస్ లేని వాటికి గుట్టుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి జరిగిన రిజిస్ట్రేషన్లు, నిబంధనల ఉల్లంఘనపై శాఖ ఉన్న తాధికారులను ఆరా తీసిన అనంతరం వైరా సబ్ రిజిస్ట్రార్కు ఫోన్ చేసి తీవ్రంగా మండిపడినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు మంత్రి.. శాఖలో ప్రక్షాళన ప్రారంభించి ఇప్పటికే దిగువ స్థాయి నుంచి పైస్థాయి అధికారుల వరకు బదిలీలు పూర్తి చేశారు. ఎక్కువ కాలం ఒకేచోట పనిచేసినవారిని బదిలీ చేశారు. ఆధునిక సాంకేతికతతో పారదర్శక సేవలు అందించేందుకు ఇటీవల చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇలా జరగడంపై మంత్రి.. అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి పూట జరిగిన రిజిస్ట్రేషన్లపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఎల్ ఆర్ఆ ఎస్ అనుమతులు లేకుండా ఏ విధంగా రిజిస్ట్రే షన్లు చేశారు. ఎలా నిబంధనలు ఉల్లంఘించారు. తదితర అంశాలపై విచారణ జరిపి నివేదిక అందించాలని | డీఐజీ(డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)ని శాఖ కార్యదర్శి, కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ ఆదేశించారు.
.
Aksharam Telugu Daily