Monday, 10 February 2025 07:18:00 PM
 Breaking
     -> బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు ఏవి??..      -> మెకానికల్ ఇంజనీరింగ్ లొ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి పీహెచ్ డి పట్టా :..      -> ప్రజావాణి రద్దు : జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్......      -> ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సమ్మె ఎనిమిదో రోజు విజయవంతం..      -> జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు :..      -> గవర్నమెంట్ ప్లిడర్ పోస్టుల (జి.పి) నియామకాల్లో ముస్లిం మైనార్టీ లకు ఆవకాశం ఇవ్వాలి : ..      -> సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత..      -> మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..      -> సొసైటీల అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలి :  -జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.....      -> డాక్టర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు :..      -> పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  :..      -> రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది....      -> గ్రూప్-3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్...      -> అన్నం పరబ్రహ్మ స్వరూపం ..

95 శాతం ఇందిర‌మ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి.. ఫిర్యాదుల కోసం ప్ర‌త్యేక వెబ్‌సైట్‌.. రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొం

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 09 January 2025 06:02 PM Views : 290

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ జనవరి 9 (అక్షరంన్యూస్) హైద‌రాబాద్‌:- ఇందిర‌మ్మ ల‌బ్దిదారుల‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌క‌మైన సేవ‌ల‌ను అందించాల‌నే ల‌క్ష్యంతో ఫిర్యాదుల కోసం ఇందిర‌మ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తీసుకురావ‌డం జ‌రిగింద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గురువారం నాడు సచివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిర‌మ్మ ఇండ్ల ఎంపిక‌లో ఏమైనా స‌మ‌స్య‌లు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. ఈ ఫిర్యాదుపై ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకున్న చ‌ర్య‌ల వివ‌రాలు ఫిర్యాదుదారుని మొబైల్ కు మెసేజ్ ద్వారా తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. గ్రామాల్లో ఎంపీడీవో, ప‌ట్ట‌ణాల్లో మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ ద్వారా సంబంధిత అధికారుల‌కు ఫిర్యాదు వెళ్తుంది. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కానికి త‌మ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది,ఎలాంటి మ‌ధ్య‌వ‌ర్తుల‌కు తావులేకుండా అర్హులైన వారికే ఇండ్లు మంజూర‌య్యేలా పార‌ద‌ర్శ‌కంగా చ‌ర్య‌లు తీసుకుంటుంది. వీలైనంత త్వ‌రిత‌గ‌తిన‌ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఇప్ప‌టికే ఇందిర‌మ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న ఈనెల 8వ తేదీనాటికి హైద‌రాబాద్ మిన‌హా 32 జిల్లాల‌లో 95 శాతం పూర్తికాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 88 శాతం పూర్త‌యింది. త్వ‌ర‌లో ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేసి ఇండ్ల నిర్మాణానికి చేప‌ట్ట‌వ‌ల‌సిన కార్యాచ‌ర‌ణ‌పై దృష్టి సారించాల‌ని అలాగే అర్హులైన ల‌బ్దిదారుల‌కు ఇండ్లు అందేలా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. మొద‌టి విడ‌త‌లో నివాస‌స్ద‌లం ఉన్న‌వారికి ఇండ్లు నిర్మించి ఇస్తామ‌ని, రెండ‌వ ద‌శలో ప్ర‌భుత్వమే నివాస స్ద‌లంతోపాటు ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుంద‌ని అన్నారు. మొద‌టి విడ‌త‌లో విక‌లాంగులు, ఒంట‌రి మ‌హిళ‌లు, అనాధ‌లు, వితంతువులు, ట్రాన్స్ జెండ‌ర్లు, స‌ఫాయి క‌ర్మ‌చారుల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని అధికారుల‌కు సూచించారు. గత ప్ర‌భుత్వంలో ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్య‌వ‌స్ధ ఉండేద‌ని, ఇప్పుడు ఆ వ్య‌వ‌స్ధ‌ను ర‌ద్దు చేసి ల‌బ్దిదారులే ఇండ్లు నిర్మించుకునేలా అవ‌కాశం క‌ల్పించాం. ల‌బ్దిదారులు త‌మ సౌల‌భ్యాన్ని బ‌ట్టి 400 చ‌ద‌ర‌పు అడుగుల‌కు త‌గ్గ‌కుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇండ్లు నిర్మించుకోవ‌చ్చని చివ‌రి ల‌బ్దిదారుని వ‌ర‌కు ఇండ్ల మంజూరు చేసి నిర్మించే బాధ్య‌త ఈ ఇందిర‌మ్మ ప్ర‌భుత్వానిదేన‌ని ఆయ‌న మ‌రోమారు స్పష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హౌసింగ్ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ జ్యోతి బుద్ధ ప్ర‌కాష్‌, హౌసింగ్ కార్పోరేష‌న్ ఎండీ విపి గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. -ఇందిర‌మ్మ ఇండ్లు గ్రీవెన్స్ మాడ్యూల్ వెబ్‌సైట్ ను గురువారం రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్రారంభించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :