Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా జనవరి 8 (అక్షరంన్యూస్)* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రోడ్డు భద్రత మహోత్సవాల్లో బుధవారం వైరా మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర పాల్గొని ఈ సందర్భంగా వాహన డ్రైవర్లకు ఆయన భద్రత వారోత్సవాల నేపథ్యంలో పలు సూచనలు చేసి అవగాహన ఏర్పాటు చేశారు. ప్రతి వాహనదారుడు వాహనాన్ని అతివేగంగా నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి, మద్యం సేవించి వాహనాల నడపవద్దని, వాహనాలను ఓవర్టేక్ చేసే ముందు ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించాలని, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు ఎలిమెంట్ను కార్లు తోలేటప్పుడు షీట్ బెల్ట్ ను తప్పకుండా ఉపయోగించాలని, మైనర్లు వాహనాలను తోలొద్దని ఆయన సూచించారు, రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టవలసిన జాగ్రత్తలను రవిచంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ కార్యాలయం సిబ్బంది. మినీ వాహనాల డ్రైవర్లు ఓనర్లు, లారీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily