Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : -అక్షరం దినపత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరణ పెద్దపల్లి ప్రతినిధి జనవరి 7 అక్షరం న్యూస్; ప్రతి అక్షరం ప్రజా సమస్యలపై సంధిస్తూ అక్షరం దినపత్రిక ప్రజలలో చెరగని ముద్ర వేసుకుందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ పేర్కొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అక్షరం దినపత్రిక రూపొందించిన 2025 ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను మున్సిపల్ కమిషనర్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ సరికొత్త వార్త కథనాలతో ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో అక్షరం దినపత్రిక ముందుంటుందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై వార్త కథనాలు అందిస్తున్న అక్షరం దినపత్రిక ప్రజల గొంతుకగా మారి తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజా చైతన్యం చేయడంలో అక్షరం దినపత్రిక ఎప్పుడు ముందుంటుంది అన్నారు. నిజాయితీ నిబద్ధతతో పనిచేసే అధికారులు ప్రజాప్రతిద్యుల పై ప్రత్యేక కథనాలు అందిస్తూ ప్రోత్సాహకంగా నిలుస్తుందని మున్సిపల్ కమిషనర్ ప్రశంసించారు. అలాగే అవినీతి అక్రమాలపై సమర శంఖం పోలీసు అక్షరం పత
.
Aksharam Telugu Daily