Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా, జనవరి 7 (అక్షరంన్యూస్) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మాసొ త్సవాల సందర్భంగా వైరా మున్సిపాలిటీ పరిధిలోని పల్లిపాడు కార్తీక్ విద్యాలయంలో రోడ్ సేఫ్టీ పై విద్యార్థులకు వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనను తప్పనిసరిగా పాటించాలని, ప్రతి వాహనదారుడు ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెలిమెంట్, కారు ఇతర ఫోర్ వీలర్ వాహనాల తోలేటప్పుడు సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలని అన్నారు, 18 సంవత్సరాలు నిండని మైనర్లు వాహనాలను తోలొద్దని ,మేజర్లు మాత్రమే వాహనాలు తోనాలని లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి, అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలని అతివేగంగా వాహనాలు నడపకుండా ఉండాలని ఇది ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు వారి కుటుంబ సభ్యులకు వివరించాలని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ట్రైనీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర మరియు మోటార్ వెహికల్ కార్యాలయం సిబ్బంది కార్తీక్ విద్యాలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily