Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జనవరి 7 అక్షరం న్యూస్; ప్రారంభమైన అనతి కాలంలోనే నిజాలను నిర్భయంగా వెలికితీస్తూ అక్షరం దినపత్రిక తన వంతు పాత్ర పోషిస్తుందని పెద్దపల్లి స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో అక్షరం దినపత్రిక రూపొందించిన 2025 ఆంగ్ల సంవత్సర నూతన క్యాలెండర్ ను అదనపు కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనిచేసే అధికారులకు ప్రోత్సహించే కథనాలు రాయడంలో అక్షరం పత్రిక ముందుంటుందని ఆమె పేర్కొన్నారు. అలాగే అవినీతిపై సమర శంఖం పూరించడం కూడా అక్షరం దినపత్రిక తన పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి జిల్లా ప్రతినిధి దొమ్మటి రాజేష్ తో పాటు పాత్రికేయులు నూనె శ్రీనివాస్ ఓడ్నాల అజయ్ వాల్మీకి రమేష్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily