Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జనవరి 7 అక్షరం న్యూస్; ప్రజా చైతన్యం చేయడంలో అక్షరం దినపత్రిక తన వంతు పాత్ర సమర్థవంతంగా నిర్వహిస్తుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గురువారం అక్షరం దినపత్రిక రూపొందించిన 2025 ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కథనాలు అందిస్తూ అక్షరం దినపత్రిక తన ప్రత్యేకతను చాటుకుంటుందని ప్రశంసించారు. సమస్యలపై, రాజకీయ అంశాలపై ప్రత్యేక వార్తా కథనాలను అందిస్తూ ఎప్పటికప్పుడు అక్షరం దినపత్రిక కొత్తదనాన్ని పంచుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాల అమలుకు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా అక్షరం పత్రిక పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అక్షరం దినపత్రిక పెద్దపల్లి ప్రతినిధి దొమ్మటి రాజేష్, విలేకరులు నూనె శ్రీనివాస్, ఓడ్నాల అజయ్, వాల్మీకి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily