Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ, జనవరి 7 (అక్షరంన్యూస్) అక్షర కథనానికి స్పందించిన నేషనల్ హైవే అధికారులు.. రోడ్డు నిర్మాణం తో నరకప్రాయంగా ఆర్ అండ్ బి రోడ్డు ప్రయాణం అనే వార్తను అక్షరం దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.. ఖమ్మం నుంచి రాజమండ్రి వరకు నిర్మాణం చేయబడుతున్న నేషనల్ హైవే నిర్మాణానికి కావాల్సిన మట్టి కంకర, ప్లేయష్, ఇనుము వంటి ముడి సరుకులు భారీ వాహనంతో అధిక బరువుతో కొత్త మిట్టిపల్లి నుంచి ఎన్ హెచ్ హైవే వరకు రాకపోకలు సాగించడంతో ఆర్ అండ్ బి రహదారి ఛిద్రం అవడంతో పాటుగా భారీ గుంతలు పడి రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలు వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని వార్తను అక్షరం కథనంలో ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. దానితో నేషనల్ హైవే అధికారులు మారుమత్తులు చేపట్టారు.. ఈ సందర్భంగా అక్షరం దినపత్రికకు ప్రజలు వాహనదారులు అభినందనలు తెలిపారు.
.
Aksharam Telugu Daily