Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : *ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా, జనవరి 7 (అక్షరంన్యూస్)* *వైరా రవాణా శాఖ, యూనిట్ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం యూనిట్ కార్యాలయం, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర మంగళవారం కార్యాలయంనకు వచ్చిన లెర్నర్స్ లైసెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్, వాహనాలు రిజిస్ట్రేషన్ కొరకు వచ్చిన దరఖాస్తు దారులకు , మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ వాహనాల ఫిట్నెస్ కొరకు వచ్చిన డ్రైవర్స్ కు, రోడ్డు పైన వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా మూల మలుపులు, క్రాస్ రోడ్డులు వద్ద , ఇరుకు వంతెన మీద ఓవర్ టేక్ చేసేటప్పుడు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున.. ఆయా సంధర్భాల బట్టి వేగం తగ్గించుకొనుట,హార్న్ మోగించడం, అవసరమైతే ఒక్క క్షణం ఆగటం తప్పనిసరిగా అని ఉదాహరణల సహితంగా గతంలో పరిసర ప్రాంతాలలో జరిగిన ప్రమాదాలను గుర్తు చేశారు. ప్రమాదాలు జరిగిన ప్రాణ నష్టం జరగకుండా హెల్మెట్, సీటు బెల్ట్ రక్షిస్తుందని తప్పనిసరిగా ధరించాలని సూచిస్తూ ...హెల్మెట్ మీద..ముందు, వెనుక వైపున .. "నన్ను ధరించు - నిన్ను రక్షిస్తా" అనే నినాదాన్ని రేడియం స్టికర్స్ తో అంటించి..ద్విచక్ర వాహన డ్రైవర్స్ హెల్మెట్ ధరించడం వలన తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు..కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని తెలియ జేశారు.. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, మద్యం మత్తులో, నిద్ర మత్తులో వాహనాలు నడిపినట్లయితే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని వివరించారు.. అదేవిధంగా..18 సంవత్సరాల లోపు పిల్లలు (మైనర్లకు) వాహనాలు నడుపుట చట్టరీత్యా నేరం శిక్షహార్హులు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది కానిస్టేబుల్ బడే సాయిబ్, ప్రసాద్, కృష్ణారావు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily